పలు సాంకేతిక కారణాల వల్ల సెట్‌ పరీక్షల తేదీలు మార్పు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 24, 2020

పలు సాంకేతిక కారణాల వల్ల సెట్‌ పరీక్షల తేదీలు మార్పు

పలు సాంకేతిక కారణాల వల్ల ఎంసెట్‌ను (ఇంజనీరింగ్‌) మే 4వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. 4వ తేదీన రెండు సెషన్లుగా, 5వ తేదీన ఒక సెషన్‌గా, 7వ తేదీన రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలును సవరించారు. 8వ తేదీ కూడా ఎంసెట్‌ నిర్వహణ కోసమే రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటే 8వ తేదీన కూడా ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహిస్తారు. మే 25వ తేదీన లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ రంజాన్‌ నేపథ్యంలో లాసెట్, పీజీ లాసెట్‌ పరీక్షలను మే 27వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. మే 27 నుంచి నిర్వహించాల్సిన పీజీ ఈసెట్‌ పరీక్షలను సవరించిన షెడ్యూలు ప్రకారం మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష, ఈసెట్, పీఈ సెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాలు, రంజాన్‌ నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందునా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వికలాంగులకు ఫీజు రాయితీపై ఆయా సెట్స్‌ కమిటీల సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులను పెంచబోమని స్పష్టం చేశారు.  

Post Top Ad