భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడి

నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది . ఆదివారం (జనవరి 12) రాత్రి ఓ యువకుడు బైక్‌పై స్పీడుగా వెళుతుండగా.. కొర్బా గల్లీలో స్థానిక యువకులు అతడిని ఆపి మెల్లగా వెళ్లాలని సూచించారు. అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆ యువకుడు తన వర్గానికి చెందిన వారిని వెంట తీసుకొని వచ్చి స్థానికంగా విధ్వంసం సృష్టించినట్లు సమాచారం. దీంతో పట్టణంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


భైంసాలో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎలాంటి ఆందోళనలు లేవని చెప్పారు. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పనిలేదన్నారు. భైంసాలో పరిస్థితులు బాగోలేవంటూ సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవుతున్నాయని.. అక్కడ ఎలాంటి అలజడి లేదని వివరించారు.నిర్మల్ జిల్లాలో భైంసాలో వరసగా ఐదో రోజూ 144 సెక్షన్‌ కొనసాగుతోంది.  భైంసా దాడి ఘటనతో సంబంధం ఉన్న 70 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఇరు వర్గాలకు చెందిన వారున్నారు. వీరిపై 20 కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటీజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. పట్టణంలో ప్రజా జీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )