శుభతెలంగాణ ముందుగా తెలిపినట్లే కొత్త సంవత్సర వేళ తెలంగాణ లో పలు చోట్ల స్వల్ప వర్షాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 02, 2020

శుభతెలంగాణ ముందుగా తెలిపినట్లే కొత్త సంవత్సర వేళ తెలంగాణ లో పలు చోట్ల స్వల్ప వర్షాలు

శుభతెలంగాణ ముందుగా తెలిపినట్లే కొత్త సంవత్సర వేళ తెలంగాణ లో పలు చోట్ల స్వల్ప వర్షాలు కురిసాయి . అలాగే హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు కురిసాయి .    బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, లక్డీకాఫూల్‌, నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లిలో భారీ వర్షం కారణంగా నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం ఆలస్యం కానుంది. ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు వర్షానికి తడిసిపోయాయి. వర్షం నీరు భారీగా చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నుమాయిష్‌ పారిశ్రామిక ప్రదర్శన రోజునే భారీ వర్షం రావడంతో సందర్శకులు సంఖ్య తగ్గే అవకాశముంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )