భారత క్రీడాకారిణి పీవీ సింధు (బ్యాడ్మింటన్‌) కి పద్మభూషణ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

భారత క్రీడాకారిణి పీవీ సింధు (బ్యాడ్మింటన్‌) కి పద్మభూషణ్‌

2012లో 17 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌-20లో అడుగుపెట్టడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సింధు గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం పతకం గెలుచుకొనే వరకు ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన ఆమె..ఆ ఘనత వహించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో మరో ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను 2018లో కైవసం చేసుకున్న 24 ఏళ్ల సింధు..టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈక్రమంలో ప్రకటించిన పద్మభూషణ్‌ రాబోయే ఒలింపిక్స్‌కు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం ఖాయం. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు లభించింది. సింధుకంటే ముందు తెలుగు క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా (2016) పద్మభూషణ్‌ అందుకున్నారు.
క్రీడా పద్మాలు వీళ్లే..
పద్మ విభూషణ్‌
మేరీకోమ్‌ ( బాక్సింగ్‌) 
పద్మ భూషణ్‌
పీవీ సింధు (బ్యాడ్మింటన్‌)
పద్మశ్రీ
జహీర్‌ ఖాన్‌ (క్రికెట్‌), రాణీ రాంపాల్‌ (హాకీ), ఎంపీ గణేశ్‌ (హాకీ), జీతూ రాయ్‌ (షూటింగ్‌), ఓనియమ్‌ బెంబెమ్‌ దేవి (ఫుట్‌బాల్‌), తరుణ్‌దీప్‌ రాయ్‌ (ఆర్చరీ)

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad