రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో పాల్గొనడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్నారు. సోమవారం ప్రారంభమైన 50వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులో టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరుగనున్నది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు. సమావేశాల సందర్భంగా ప్రపంచదేశాలకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీకానున్నారు. రాష్ట్రంలో ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్‌, జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌, కృత్రిమ మేధ, ఎలక్ట్రానిక్‌ సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )