దేశ వ్యాప్తంగా మహిళల్లో వెల్లువిరుస్తున్న సంతోషం : మహిళలు స్వీట్లు పంచుకొని ఆనందం పంచుకుంటున్న వైనం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 08, 2020

దేశ వ్యాప్తంగా మహిళల్లో వెల్లువిరుస్తున్న సంతోషం : మహిళలు స్వీట్లు పంచుకొని ఆనందం పంచుకుంటున్న వైనం


నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి వేసేందుకు తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నేరస్తులకు వారికి డెత్ వారెంటీ జారి అయినందున, ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు నలుగురిని ఒకేసారి ఉరి వేయాలని పటియాల హౌస్ కోర్టు తీర్పునిచ్చిన వెంటనే తీహార్ జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. బిహార్ రాష్ట్రం బక్సర్ జైలు నుంచి ఇప్పటికే ఉరి తాళ్లు తెప్పించామని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం తీహర్ జైలులో ఉరి వేసేందుకు తలరీలు లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి తలారిని రప్పించాలని నిర్ణయించారు. ఉరి తీసేందుకు తలారీని కేటాయించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తీహార్ జైలు సూపరింటెండెంట్ లేఖ పంపించారు. నిందితులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్త, అక్షయ్ కుమార్ సింగ్ ను వేర్వేరు గదుల్లో పెట్టి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.