ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో అస్వస్థత : యశోద ఆస్పత్రి తరలింపు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 22, 2020

ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో అస్వస్థత : యశోద ఆస్పత్రి తరలింపు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలు విమర్శలతో దాడి చేసినా.. సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపుపై దీమాగా ఉన్న ఆయన ఎలాంటి సభలు, సమావేశాల్లోనూ పాల్గొనలేదు. కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.. నామినేషన్ల పర్వానికి ముందే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. విపక్ష నేతలు విమర్శలతో నేరుగా తనపై దాడి చేసినా.. ప్రతిస్పందించకపోవడం గమనార్హం.ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (జనవరి 21) సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సీఎం కేసీఆర్ తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన యశోద ఆస్పత్రి వైద్యులు సాధారణ జ్వరమేనని చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోద ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయమే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )