మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిరిసిల్ల ప్రజాలకు వరాల జల్లు : కేటీర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిరిసిల్ల ప్రజాలకు వరాల జల్లు : కేటీర్


సిరిసిల్ల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కళాశాల కూడా వచ్చేలా కృషి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలకు జీవనాధారం కల్పించామని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో పది నుంచి పన్నెండు వేల మంది ఆడబిడ్డలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్లను దేశంలో అత్యున్నత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తనదని పురపాలక మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. సిరిసిల్లకు త్వరలో రైలు మార్గం రావాలని.. రెండు, మూడేళ్లలో రైలు మార్గం రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం (జనవరి 15) సాయంత్రం ఆయన సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.