గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రమాదానికి గురైన పోలీస్ వాహనం


భాగ్యనగరంలోని గచ్చిబౌలిలో పోలీస్‌ పెట్రోలింగ్ కార్ ప్రమాదానికి గురైంది. ఐటీ కారిడార్‌కు చెందిన పెట్రోలింగ్ కార్ వేగంగా వచ్చి గచ్చిబౌలి స్టేడియం దగ్గర డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన కానిస్టేబుళ్లను ఆస్పత్రికి తరలించారు. అలాగే క్రేన్ సహాయంతో వాహనాన్ని తరలించారు.