నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో భారీ స్థాయి బంగారం చోరీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 16, 2020

నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో భారీ స్థాయి బంగారం చోరీ

నిజామాబాద్‌లోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో చోరీ . డిచ్‌పల్లికి చెందిన శివసాయి అనే వ్యాపారి ఎప్పటిలానే గురువారం తన బంగారు ఆభరణాల దుకాణాన్ని తెరిచేందుకు వెళ్లాడు. ఈ సమయంలో బ్యాగును తన బైక్‌పై పెట్టి దుకాణం తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే అదనుగా భావించిన దొంగలు  మరో బైక్‌పై వచ్చి బ్యాగును ఎత్తుకెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగు తిన్న షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో రూ.15 లక్షల విలువ చేసే నగలు, నగదు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.