కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా, కుల గణన ముసాయిదా జాబితాను ప్రకటించారు. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండితే చాలు. ఓటు నమోదు చేసుకుని ఈనెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చు.
కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈనెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నమోదు చేసుకుకే అవకాశం ఉంది. www. nvcp.in, www.ceotelangana.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్‌గా నమోదు చేసుకోచ్చు. దీనికి గాను ఫారం నంబర్–6ను పూరించి అప్లోడ్ చేయాలి. గత నెల 30వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వీటికి గత నెల 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 3వ తేదీన అభ్యంతరాలకు సమాధానాలు, వివరణ ఇస్తారు. 4న తుది జాబితా ప్రకటించి, 7న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈలోపు ఓటర్‌గా నమోదు చేసుకోవడం మన ఓటు గల్లంతు అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంటనే వాటిని సరి చేస్తారు. గత ఓటర్ల జాబితా ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్లు ఒక డివిజన్లో ఉండి మీ ఓటు మరో డివిజన్లో ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 2014వ ఎన్నికల సమయంలో 2,28,872 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికలు వచ్చే సరికి 2,72,194 మందికి పెరిగిపోయారు. గడిచిని 5 ఏళ్లలో 43,322 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 20,825 ఓటర్లు పెరిగారు. డివిజన్ల పునర్వీభజన ప్రకటించిన నాటి నుంచి 14,408 మంది ఓటర్లు పెరిగినట్లు గణనాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి మరికొంత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )