మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేడే : పరోక్ష పద్ధతిలో ఓటింగ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నేడే : పరోక్ష పద్ధతిలో ఓటింగ్


ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగిం చిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికైనట్లుగా ధ్రువీకరణ పత్రాలు ., ఎన్నికైన సభ్యు లు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో మున్సిపాలిటీ ప్రత్యేక భేటీని నిర్వహిస్తారు. సోమవారం ఉద యం 11 గంటలకు మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు, కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తారు. తర్వాత వారు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత వీరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మున్సిపాలిటీ కౌన్సిల్‌లోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సమావేశానికి హాజరై ఉంటేనే కోరం ఉందని నిర్ధారించి మేయర్‌ /చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానా లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆపై ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించి, ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు.  


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad