బాలాపూర్‌ గ్రామంలో దారుణ హత్య - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

బాలాపూర్‌ గ్రామంలో దారుణ హత్య

బాలాపూర్‌ గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో నివాసముంటున్న జొన్నాడ ప్రశాంత్‌(22) ఏఆర్‌సీఐలో లేబర్‌గా పని చేస్తుండేవాడు. గత మూడు నెలల నుంచి ఏ పని చేయకుండా ఖాళీగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. కాగా, కొంత మంది కూలీలు.. కూలీ పని చేసుకొని తమ సామాగ్రిని పని ముగిసిన అనంతరం ఏఆర్‌సీఐ సమీపంలో ఉన్న డెకరేషన్‌ గోడౌన్‌లో పెట్టి.. ఉదయం తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తమ సామన్లు తీసుకోవడానికి కూలీలు గోడౌన్ లోపలికి వెళ్లగా ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెంది ఉన్నట్లు వారు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా కాళ్లకు, చేతులకు లేత గులాబి రంగు బట్టతో కట్టేసి నోట్లో బట్ట కుక్కి ఉరేసినట్లు కనపడుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రశాంత్‌ను హత్య చేసి ఉరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకు హత్య చేసి ఉంటారనేది కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారని పోలీసులు తెలిపారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )