తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ భేటీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 25, 2020

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మొరిగిన వాళ్లందరికీ ఈ ఫలితాలు కొట్టిన చెంపదెబ్బ మామూలు దెబ్బకాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "హీనంగా దిగజారి సోషల్ మీడియాలో దూషించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు మానుకోకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ మీడియానా..? లేకుంటే యాంటీ సోషల్ మీడియానా..?. టీఆర్ఎస్ మొదట్నుంచి క్రమశిక్షణతో పెరిగింది. ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోవద్దని ప్రజలు మరోసారి తేల్చిచెప్పారు’ అని కేసీఆర్ స్పష్టం చేశారు."

Post Top Ad