నూతన పోలీస్‌ బ్యాండ్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌అలీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

నూతన పోలీస్‌ బ్యాండ్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌అలీ

తెలంగాణ రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్పీ) బెటాలియన్స్‌ విభాగంలో కొత్తగా నాలుగు బెటాలియన్ల పోలీస్‌బ్యాండ్స్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి శనివారం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఆయన ప్రారంభించారు. ఆదిలాబాద్‌ యాపల్‌గూడలోని 2వ బెటాలియన్‌, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌, జయశంకర్‌ భూపాలపల్లిలోని 5వ బెటాలియన్‌, భద్రాద్రి కొత్తగూడెంలోని 6వ బెటాలియన్‌ల్లో ఈ బ్యాండ్‌ బృందాలు ఉన్నాయి. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. డీజీపీ పర్యవేక్షణలో పోలీస్‌శాఖ బాగా పనిచేస్తున్నదని ప్రశంసించారు. కాగా, కాల్వశ్రీరాంపూర్‌లో నీలకంఠ చెరువులో మునిగిన కారులోని ఆరుగురు కుటుంబసభ్యులను కాపాడిన టీఎస్‌ఎస్పీ 17 బెటాలియన్‌ పెద్దపల్లికి చెందిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, పవన్‌లను ప్రశంసాపత్రాలతో హోం మంత్రి, డీజీపీలు అభినందించారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్పీ అడిషనల్‌ డీజీ అభిలాష బిస్త్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్‌ డీజీలు జితేందర్‌, సంతోష్‌మెహ్ర, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.