ప్రేయసిని రూమ్ కి పిలిచి గొంతు కోసిన భగ్న ప్రేమికుడు , వరంగల్ లో దారుణ ఘటన - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 10, 2020

ప్రేయసిని రూమ్ కి పిలిచి గొంతు కోసిన భగ్న ప్రేమికుడు , వరంగల్ లో దారుణ ఘటన


 వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ యువకుడు 20 ఏళ్ల ఓ యువతిని గొంతు కోసి చంపేశాడు. బాధితురాలిని తన గదిలోకి రప్పించుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం జడ్జి ముందు లొంగిపోయాడు. న్యాయమూర్తి అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కాజీపేటకు చెందిన షాహిద్‌గా గుర్తించారు. హన్మకొండలోని రామ్‌నగర్‌లో శుక్రవారం (జనవరి 10) సాయంత్రం ఈ దారుణం జరిగింది.ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. బాధితురాలు శుక్రవారం సాయంత్రం కాలేజీ ముగిసిన అనంతరం నిందితుడు షాహిద్ గదికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన యువకుడు ఉన్మాదిలా మారి.. బ్లేడుతో యువతిని అతి దారుణంగా గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తోంది. బాధితురాలు, షాహీద్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో షాహిద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.