హైదరాబాద్ లో కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనా నుండి వచ్చే విమానాల ప్రయాణికులకు ........... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 24, 2020

హైదరాబాద్ లో కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనా నుండి వచ్చే విమానాల ప్రయాణికులకు ...........

దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. చైనా, హాంగ్‌ కాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. గత 3 రోజుల నుంచి హాంగ్‌ కాంగ్‌ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలు కొనసాగలేదని అధికారులు వెల్లడించారు. గురువారం (జనవరి 23) అర్ధరాత్రి దాటిన తర్వాత హాంక్‌ కాంగ్‌ నుంచి విమానం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళకు చెందిన ఓ నర్సు ఈ వైరస్ బారిన పడినట్లు వస్తున్న వార్తలు భారత్‌లో కలకలం రేపుతున్నాయి.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. 

Post Top Ad