తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల

 తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు.  వారం రోజులుగా సామాజిక కుల గణన, ఓటరు ముసాయిదా జాబితాపై కసరత్తు చేసిన అధికారులు మొత్తం ఓటర్లను వార్డుల వారీగా విభజించి తుది జాబితా తయారు చేశారు.  నీలగిరి మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను  మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌ విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను కూడా వార్డుల వారీగా లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేశారు. పురుషల కన్నా మహిళలు 2,613 మంది ఎక్కువగా ఉన్నారు.