మళ్ళీ రంగంలోకి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

మళ్ళీ రంగంలోకి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి గత నవంబర్‌ 4న ప్రాంభించారు.  కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రవీణ్‌ (22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు దిద్దుబాటులో భాగంగా భద్రతా చర్యలు చేపట్టారు. నవంబర్‌ 23న శనివారం ప్రమాదం జరిగిన రోజు మూసివేసిన ఫ్లైఓవర్‌పై మళ్లీ శనివారమే రాకపోకలు ప్రారంభం కానుండటం గమనార్హం.బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేశారు. ఒక చోట రబ్బరు స్పీడ్‌ బ్రేకర్‌ వేశారు. 12 చోట్ల స్పీడ్‌ బ్రేకర్లుగా రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు. ఫ్లై ఓవర్‌ పొడవునా నాలుగు వరుసలుగా తెల్లరంగు, ఎరుపు రంగు క్యాట్‌ ఐస్‌ను బిగించారు. ఫ్లైఓవర్‌ మధ్యలో ఎడమ వైపు సైడ్‌ వాల్‌పై రీలింగ్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేసే సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక మెటీరియల్‌తో ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ లిమిట్‌ 40 కిలో మీటర్లు అని తెలిసేలా రంబుల్‌ స్ట్రిప్స్‌ వేశారు.