తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జనవరి 24న పోలింగ్ జరుగనుంది. బుధవారం (జనవరి 22) ఎన్నికలు జరుగుతున్న 120 మున్సిపాలిటీల పరిధిలో 80 వార్డులు, 9 కార్పొరేషన్ల పరిధిలో ఒక డివిజన్ ఏకగ్రీవం కాగా.. వీటిలో 77 వార్డులు, 1 డివిజన్‌ను అధికార టీఆర్ఎస్, 3 వార్డులను ఎంఐఎం దక్కించుకున్నాయి. మొత్తం 2,647 వార్డులకు 11,099 అభ్యర్థులు, 324 డివిజన్లకు 1,744 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. జనవరి 25న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.గద్వాలలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రదేశాన్ని సందర్శించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )