పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఎంఐఎం తరపున భారీ ర్యాలీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఎంఐఎం తరపున భారీ ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది ముస్లింలు తరలొచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పిలుపుమేరకు నగరంలోని ముస్లిం యువత కదిలొచ్చి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ట్యాంక్‌బండ్‌పైకి ఆశేష జనవాహిని చేరుకోవడంతో 'మిలియన్ మార్చ్'ను తలపించింది.
ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, లిబర్టీ జనసంద్రాన్ని తలపించాయి. ముస్లింలు జాతీయ జెండా చేతబట్టుకొని హిందుస్థాన్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో దాదాపు 25 వేల మందికిపైగా ముస్లింలు పాల్గొన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముస్లింల ర్యాలీతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ట్యాంక్‌బండ్‌పై వచ్చే రహదారులు గంటల తరబడి వాహనాలు ఆగిపోయాయి.