కూకట్ పల్లి లో నూతనంగా కోణార్క్ రెస్టారెంట్ ప్రారంభం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

కూకట్ పల్లి లో నూతనంగా కోణార్క్ రెస్టారెంట్ ప్రారంభం..

 కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజక వర్గం కె పి హెచ్ బీ రోడ్డు నంబర్ 2 ధనలక్ష్మి సెంటర్ వద్ద నూతనంగా కోణార్క్ రెస్టారెంట్ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా లక్ష్మీ బాలాజీ ఫైనాన్సియర్స్ అధినేత శ్రీమతి & శ్రీ కె. వనజ మోహన్ బాబు దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు.

హైదరాబాద్ అంటేనే రెస్టారెంట్లకు, షాపింగ్ మాళ్లకు పెట్టింది పేరు. అందులో కూకట్ పల్లి అంటే చాలు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు అది అన్ని రకాల సదుపాయాలకు ఆలవాలం అని. ఇప్పటి పోటీపడే కాలానికి ఏమాత్రం తీసిపోకుండా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ రెస్టారెంట్ ప్రారంభించామని ఈ సంస్థ యజమాని శ్రీధర్ అంటున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ రెస్టారెంట్ లో రేట్లు ఉంటాయని తమ వద్ద ఇరానీ చాయ్ నుండి మొదలుకొని జ్యూస్, బేకరి ఐటమ్స్, చైనీస్, బిర్యానీ మరియు సాయంత్రం వేళల్లో చపాతీ, పరోట, చికెన్ షేర్వ లాంటి స్పెషల్ వెరైటీస్ కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.

Post Top Ad