మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 23, 2020

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

గోడౌన్‌ యాజమాన్యం రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో పాటు, భారీగా పొగ కమ్ముకుంది.ఫైర్‌ ఇంజన్‌.. ప్రమాద స్థలానికి చేరుకోగా, సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కాగా, ఈ స్క్రాప్‌ గోదాంకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. సంబంధిత అధికారుల అండదండలతో ఈ గోదాం అక్రమ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )