నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు

 నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం సహా పలు గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అని జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగదని వారు తెలుపుతున్నారు.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సుమారు 35 సెకన్ల వరకు భూమి కంపించినట్లు తెలుస్తోంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad