తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 11 సార్లు స్వల్పంగా భూమి కంపించిందని శాస్త్రవేత్త కీలక విశ్లేషణ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 11 సార్లు స్వల్పంగా భూమి కంపించిందని శాస్త్రవేత్త కీలక విశ్లేషణ

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సహా కొన్ని చోట్ల వచ్చిన భూ ప్రకంపనలపై భూ భౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ నగేశ్ స్పందించారు. భూమి కంపించినప్పుడల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే చాలా సురక్షితమని ఆయన సూచించారు. ప్రజలు తమ కట్టడాలు పటిష్ఠంగా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవాలని హితవు పలికారు. శనివారం రాత్రి నుంచి 11 సార్లు స్వల్పంగా భూమి కంపించిందని ఆయన తేల్చారు. దీని తీవ్ర రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు చెప్పారు.శనివారం రాత్రి దాటాక తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట సహా ఏపీలోని కృష్ణా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఉన్నట్టుండి భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని దగ్గర నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట వద్ద గల వివిధ గ్రామాల్లో 3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad