పురపాలికల ఎన్నికల సందర్బంగా కొత్త ఓటరు జాబితా విడుదల . ఈ జాబితాలో రామగుండం నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కోసం అధికారులు చేపట్టిన కుల గణన సర్వేలో మళ్లీ తప్పులుదొర్లాయి. సోమవారం అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శనకు పెట్టారు. జాబితాలో డివిజన్ల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను సామాజిక వర్గాలవారీగా ప్రదర్శనకు పెట్టారు. మంగళవారం జాబితాను పరిశీలించిన పలువురు ఖంగుతిన్నారు. ఓటర్ల కులాలను తప్పులతడకగా నమోదు చేసిన అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా డివిజన్లలో సామాజిక వర్గాలను గుర్తించడానికి అధికారులు మొక్కుబడిగా సర్వే చేపట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక సామాజిక కులానికి చెందిన వ్యక్తిని, మరో సామాజిక కులం వ్యక్తిగా తప్పుగా నిర్ధారిస్తూ ఓటర్ల ముసాయిదా జాబితాలో పొందుపర్చడం గమనార్హం. గత జూలైలో కూడా అధికారులు ఓటర్ల సామాజిక వర్గాలను గుర్తించడంలో తప్పులు దొర్లాయని ఆయా సామాజిక వర్గాలకు వారు ఫిర్యాదులు చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి కొత్త జాబితా రూపొందించినట్లు చెబుతున్న అధికారులు, సోమవారం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదాలో కూడా తప్పులు దొర్లడంతో చర్చనీయాశంగా మారింది. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయకుండా... ఒకే దగ్గర కూర్చొని తప్పులతడకగా జాబితా తయారు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
Post Top Ad
Wednesday, January 01, 2020
మరో సారి తప్పులతో కూడిన జాబితా విడుదల చేసిన ఎన్నికల కమీషన్
Admin Details
Subha Telangana News