ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌ కు వెళ్లిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ . - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌ కు వెళ్లిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ .

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌  కు వెళ్లిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ . దావోస్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ శాఖ స్వాగతం పలికింది. టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు గందె శ్రీధర్‌ మంత్రికి స్వాగతం పలికారు.రాష్ట్రానికి  పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి చేస్తున్న కృషి ఫలించాలని ఆయన ఆకాక్షించారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు డబ్ల్యూఈఎఫ్‌-50వ వార్షిక సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి ఆర్థిక వేత్తలు, రాజకీయవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. సంస్థ ప్రత్యేక ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ దావోస్‌కు వెళ్లారు. ఈ సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవంలో 'టెక్నాలజీ ప్రయోజనాలు-ఎదురయ్యే సవాళ్ల'పై చర్చ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రగతిని వివరించేలా ప్రసంగించనున్నారు. సదస్సు అనంతరం ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో కేటీఆర్‌ భేటీ కానున్నారు. వారికి రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )