ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం : ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 26, 2020

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం : ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలుదేశ 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి . ఈ వేడుకలలో జండా వందనం తర్వాత జరిపే శకటాల ప్రదర్శనలో ఈ సారి తెలంగాణ శకటం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర దిన వేడుకల వేదికగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఆవిష్కృతమైంది. రాజ్‌పథ్ వద్ద ఈ ఉదయం నిర్వహించిన పరేడ్‌లో అన్ని రాష్ట్రాల శకటాల నడుమ తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, వేయి స్తంభాల గుడి సెట్‌తో రూపొందిన బండి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ శకటం వెళ్తుండగా, చుట్టూ గిరిజన కళాకారులు చేస్తున్న నృత్యాలు అబ్బురపరిచాయి. ఇదే సమయంలో వినిపించిన బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ గీతాలు అద్భుతం అనిపించాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad