100 శాతం వాటా విక్రయం : బిడ్డర్లు మార్చి 17 లోగా తమ సంసిధ్ధతను తెలపాలని కోరిన కేంద్రం - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 27, 2020

100 శాతం వాటా విక్రయం : బిడ్డర్లు మార్చి 17 లోగా తమ సంసిధ్ధతను తెలపాలని కోరిన కేంద్రం


ఎయిరిండియా విక్రయానికి సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల బిడ్డర్లు మార్చి 17 లోగా తమ సంసిధ్ధతను తెలపాలని కోరింది. క్వాలిఫై అయిన బిడ్డర్లను మార్చి 31 న నోటిఫై చేస్తామని పేర్కొంది. అయితే ఈ స్ట్రాటిజిక్ డిజిన్విస్ట్ మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం మాత్రం ఈ తేదీలు మార్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్లలో ఎయిరిండియాను ఇలా వంద శాతం అమ్మకానికి పెడతామని ప్రభుత్వం ప్రకటించడం ఇది రెండో సారి. నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి లాభాల బాటలోకి తెచ్చేబదులు..దాన్ని ఏకంగా అమ్మేస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad