హైకోర్టు ఆవరణలో ఘనంగా తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 02, 2020

హైకోర్టు ఆవరణలో ఘనంగా తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ హైకోర్టు ఆవిర్భావ వేడుకలు బుధవారం రాత్రి హైకోర్టు ఆవరణలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్వీ రమణ.. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు ఆసక్తిగానే ఉందన్నారు. తెలంగాణ హైకోర్టులోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలతోపాటు ఉన్న పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్వర న్యాయం జరిగేందుకు మార్గం సులభం అవుతుందని, పెండింగ్‌ కేసుల భారం తగ్గుతుందన్నారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టుల సంఖ్య పెంపు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కి పెంచాలనే ప్రతిపాదనతోపాటు ఖాళీల భర్తీ ఫైలు కేంద్రం వద్దనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 24 మంది న్యాయమూర్తులకుగాను సీజే సహా 13 మందే ఉన్నారని, ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేంద్రం చొరవ చూపాలని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సమక్షంలోనే కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరినట్టు చెప్పారు. కేంద్రం నుంచి అనుమతి రాకుండా సుప్రీంకోర్టు ఏమీ చేయలేదన్నారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )