నిజామాబాద్ జిల్లా లో పాఠశాల బస్సుకు ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 28, 2020

నిజామాబాద్ జిల్లా లో పాఠశాల బస్సుకు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా లో పాఠశాల బస్సుకు ప్రమాదం జరిగింది. డిచ్‌పల్లిలోని విద్యా పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో విద్యార్థులు ఉండడంతో వారిలో కొందరికి తీవ్రమైన గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా.. 
ఒక చిన్నారి కాలు బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు గ్యాస్ కట్టర్‌ సాయంతో విద్యార్థిని బయటకు లాగారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు.

Post Top Ad