ప్రగతి భవన్‌లో కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ భేటీ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 13, 2020

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ భేటీ...


హైదరాబాద్‌లోని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేసీఆర్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు కలిసి కాసేపట్లో భోజనం కలిసి చేస్తారు. అనంతరం వారిరువురూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు.