తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంఈ సాయంత్రం ముగిసింది . ఈ సారి ఎన్నికలలో ప్రక్రియ ఇలా ఉండబోతుంది . ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 22న సెలవు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు.ది. జనవరి 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో 53,36,505 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. వీరిలో పురుషులు 26,71,694, స్త్రీలు 26,64557మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6.40 లక్షల మంది, అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు ఉన్నారు. కాగా 69 వార్డుల్లో టీఆర్ఎస్, 3 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు ఇక ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు 7 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను, 44 వేల మంది సిబ్బందిని నియమించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )Post Top Ad
Monday, January 20, 2020
ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
Admin Details
Subha Telangana News