సీఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే ఎస్‌ఐ లంచం తీసుకున్నారని ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 10, 2020

సీఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే ఎస్‌ఐ లంచం తీసుకున్నారని ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు వెల్లడి

రూ. 50వేలు తీసుకుంటుండగా జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, డబ్బుతో పాటు రెండు లిక్కర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. సీఐ బల్వంతయ్య ఆదేశాల మేరకే ఎస్‌ఐ లంచం తీసుకున్నారని ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సిఐ బల్వంతయ్యను కూడా విచారణ చేస్తామని చెప్పారు. 2019 డిసెంబర్‌ 29న ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లోక్‌ అదాలత్‌లో సెటిల్‌ చేస్తానంటూ సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చి.. లక్ష రూపాయలు డిమాండ్‌ చేశారని తెలిపారు.