జూబ్లీహిల్స్‌ అడ్మిన్‌ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డితోపాటు సీఐ బలవంతయ్యను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 11, 2020

జూబ్లీహిల్స్‌ అడ్మిన్‌ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డితోపాటు సీఐ బలవంతయ్యను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌

 చీటింగ్‌ కేసులో రాజీ కుదిర్చేందుకు రూ.50వేల లం చం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జూబ్లీహిల్స్‌ అడ్మిన్‌ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డితోపాటు సీఐ బలవంతయ్యను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం సస్పెండ్‌చేశారు.. సుధీర్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన వెంటనే పరారైన ప్రధాన నిందితుడు బలవంతయ్య శుక్రవారం రాత్రి ఏసీబీ ఎదుట లొంగిపోయాడు. బలవంతయ్య మరికొందరిని డబ్బు కోసం వేధించారన్న ఆరోపణలపై ఏసీబీ దృష్టిసారించింది. ఇటీవల మాదాపూర్‌లోని ఓ సంస్థ నిర్వాహకుడిపై నమోదైన అసభ్యకర ప్రవర్తన కేసుకు సంబంధించి భారీమొత్తంలోనే లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్న ఈ వ్యవహారంలో గచ్చిబౌలిలోని ఓ మల్టిప్లెక్స్‌ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. ఎవరైనా పోలీసులు లంచం అడిగితే 9490616555 నంబర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు