మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 22, 2020

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్


మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌లోని అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎంఐఎం ప్రచార సభలో అసదుద్దీన్ మాట్లాడారు. ఈ సభకు పెద్ద ఎత్తున మైనార్టీలు, ఎంఐఎం కార్యకర్తలు వచ్చారు. మంగళవారం లక్నోలో నిర్వహించిన సీఏఏ అనుకూల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏపై చర్చకు రావాలని రాహుల్, మమతా, మయావతికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ దానికి కౌంటర్ ఇచ్చారు.  కరీంనగర్‌లో పోటీ చేస్తున్న 10 మంది కార్పొరేటర్లు గెలిస్తేనే ఇక్కడ ఎంఐఎం బలమైన శక్తిగా ఎదుగుతుందని ఓవైసీ అన్నారు. మజ్లిస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కొంతమంది ప్రతి రోజు తన పేరుతో చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తూ రేటింగులు పెంచుకుంటున్నాయని అన్నారు.
‘‘బీజేపీ నేతల గురించి మీకు ఆందోళన వద్దు. మీకు నేనున్నాను. మీరు ధైర్యంగా ఓటు వేయండి. అమిత్ షా రాహుల్ గాంధీ, మమతలతో సీఏఏపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని కొందరు జర్నలిస్టులు నాకు చెప్పారు. నేను ఇప్పుడు చెబుతున్నా మీరు నాతో చర్చించండి. వాళ్లతో ఏం మాట్లాడతారు? మమత బెనర్జీ అసదుద్దీన్‌కు వ్యతిరేకం. రాహుల్ ఉదయం ఏం మాట్లాడతారో సాయంత్రం ఏం మాట్లాడతారో తెలియదు.’’ అని ఒవైసీ ప్రసంగించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )