ప్రజల సాగు భూములతో పాటు, ఇళ్ల స్థలాలూ స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం : ప్రజల ఆందోళన - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 22, 2020

ప్రజల సాగు భూములతో పాటు, ఇళ్ల స్థలాలూ స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం : ప్రజల ఆందోళన

నవభారత్‌ సమీపంలోని కేఎస్‌ఎం బంక్‌ వెనుక భాగంలో 444/1 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉందంటూ రెవెన్యూ అధికారులు 1932 సంవత్సరం నాటి నక్ష ప్రకారం సర్వే చేసి ఆరెకరాల భూమికి ఫెన్సింగ్‌ పనులు ప్రారంభించారు.ఎస్‌ఎఫ్‌సీ వారు రుణాలు ఇచ్చేముందు ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని బహిరంగ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అప్పుడేమీ మాట్లాడని రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు ప్రభుత్వ భూములంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బహుళ అంతస్తులు కట్టుకున్న సుమారు 100 మందికి సైతం ఫిబ్రవరి 3 వరకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారే ఎక్కువ.