ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ను తో భేటి అయిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 28, 2020

ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ను తో భేటి అయిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు

ఆర్థిక సంఘం చైర్మన్‌ నందకిశోర్‌ సింగ్‌ను తో భేటి అయిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులు మంగళవారం ఢిల్లీలో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చైర్మన్‌తో చర్చించారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల శాతం, బుణ పరిమితిని, మౌలిక వసతుల నిధులను పెంచాలని చైర్మన్‌ను కోరారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల నిర్వహణ నిధులు కూడా పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా నీతి అయోగ్‌ సీఫారసు మేరకు మిషన్‌భగీరథకు 19వేల కోట్లు కేంద్రం ఇచ్చేలా చూడాలని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖను చైర్మన్‌కు మంత్రి అందజేశారు. 

Post Top Ad