హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టాట్ పబ్ పై పోలీసుల దాడి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 12, 2020

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టాట్ పబ్ పై పోలీసుల దాడి



 హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని టాట్‌ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అశ్లీల నృత్యాలు జరగుతున్నాయనే సమాచారంతో ఆదివారం రాత్రి పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాడుల సమయంలో యువతీయువకులు ఉన్నప్పటికీ ఎలాంటి అశ్లీల నృత్యాలు కనిపించలేదని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అయితే కార్యక్రమానికి వచ్చిన వారి వివరాలను గుర్తింపు పత్రాలను సరిపోల్చి చూశారు
వీరిలో కొంతమంది యువతులను అదుపులోకి తీసుకుని ప్రైవేటు బస్సులో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీలో మైనర్లు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.