ఈరోజే టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 04, 2020

ఈరోజే టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం

 తెలంగాణాలో  నెల 7న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో శనివారం టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 వరకు సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.