పాత్రికేయుల ఇంటి స్థలాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, January 09, 2020

పాత్రికేయుల ఇంటి స్థలాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ హామీ

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాల  మంజూరు పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమ్మ ఒడి ప్రారంభానికి చిత్తూరు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శి లోకనాధం, అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శి సుధాకర్ నాయుడు కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఇంటి స్థలాల మంజూరు పై త్వరగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.