ఫైర్‌ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీ , త్వరలో పట్టుకుంటాం : తెలంగాణ పోలీస్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

ఫైర్‌ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీ , త్వరలో పట్టుకుంటాం : తెలంగాణ పోలీస్

 ఇటీవల వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏర్‌ శ్రీనివాస్‌  తాము తీసుకున్న చర్యలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఈ నెల 12 తేదీన ది సీక్రెట్ ఎఫైర్‌ పబ్‌లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని సమాచారం వచ్చింది. దాంతో పోలీసులు వెళ్లి దాడులు చేశారు. కొందరు పరారయ్యారు. 21 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నాం. వారిని విచారించి బాదితులుగా పేర్కొని కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాం. సిగ్నోవా కంపెనీకి చెందిన వారే రేవ్ పార్టీ నిర్వయించడానికి ప్లాన్ చేశారు. వ్యాపారాలు పెంచుకోవడం, సిగ్నోవా కస్టమర్లను ఆనందపరచడం కోసమే ఈ రేవ్‌ పార్టీ జరిగింది.  గత ఏడాదితో పోలిస్తే 2019లో హుక్కా పూర్తిగా అరికట్టామని చెప్పారు. ఈ రేవ్ పార్టీలో శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ మొని, బుర్రి ప్రసాద్ గౌడ్‌ను అరెస్ట్ చేశాం. ఎఫైర్‌ పబ్ యజమాని సంతోష్ రెడ్డి, మేనేజర్ భరత్ పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. బేగంపేట్‌లోని లిస్బన్ పబ్‌పై కూడా చర్యలు తీసుకుంటాం. ఎ

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )