ఆర్టీసీలో యూనియన్ ల స్థానంలో సంక్షేమ బోర్డు ల ఏర్పాటు కు రంగం సిద్దం. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 28, 2020

ఆర్టీసీలో యూనియన్ ల స్థానంలో సంక్షేమ బోర్డు ల ఏర్పాటు కు రంగం సిద్దం.

ఆర్టీసీలో యూనియన్ ల స్థానంలో సంక్షేమ బోర్డు ల ఏర్పాటు కు రంగం సిద్దం. ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్‌ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్‌ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్‌చార్జి, డిపో ట్రాఫిక్‌ ఇన్‌చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు.

Post Top Ad