సామాన్య జనాలపై పండగ వేళ చార్జీల భారం మోపనున్న కేంద్ర సర్కార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 10, 2020

సామాన్య జనాలపై పండగ వేళ చార్జీల భారం మోపనున్న కేంద్ర సర్కార్

సికింద్రాబాద్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలో రద్దీని నివారించడానికి ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్  నగరం నుంచి తెలుగు రాష్ర్టాలలోని ఆయా పట్టణాలు, నగరాలకు..గ్రామాలకు ఇతర రాష్ర్టాలకు లక్షలాది మంది ప్రయాణికులు బయలుదేరుతుండడంతో సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రయాణికేతరులు రైల్వేస్టేషన్‌లలోకి రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు ఈరోజు నుంచే అంటే జనవరి  9  నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.