భారీ సంఖ్యలో విలువైన పోస్టల్ ఉత్తరాలు , ఉత్తరువులు దగ్ధం చేసిన ... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

భారీ సంఖ్యలో విలువైన పోస్టల్ ఉత్తరాలు , ఉత్తరువులు దగ్ధం చేసిన ...

   విలువైన ఉత్తరాలను పోస్ట్  చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్‌ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన  ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్‌పల్లి, షాద్‌నగర్‌, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్‌లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్‌ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్‌ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు.