వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాన్వాయ్‌ కి ప్రమాదం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాన్వాయ్‌ కి ప్రమాదంవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో ముందున్న ఎస్కార్ట్ వాహనానికి గేదె అడ్డు రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనాలు, మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. మంత్రి ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడటంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన సోమవారం (జనవరి 20) వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగిసిన అనంతరం హైదరాబాద్ తిరిగివస్తుండగా కొత్తకోట శివార్లలో భారత్ గ్యాస్ గోడైన్ సమీపంలో మంత్రి కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )