టోల్ మినహాయింపు ఇవ్వడి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 12, 2020

టోల్ మినహాయింపు ఇవ్వడి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.


యాదాద్రి భువనగిరి: సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ మినహాయింపు ఇవ్వాలన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టోల్ ప్లాజాల వద్ద సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీపై ఆదివారం ఎంపీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పండగ ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందుల నడుమ కొనసాగడం పట్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు పోతున్న ప్రయాణికులు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నరని.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పంతంగి, పగిడిపల్లి, కొర్లపాడ్ టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలవడం దారుణమన్నారు.

దీనిపై రవాణాశాఖ మంత్రి పూవ్వడ అజయ్ తో ఫోన్ లో మాట్లాడానని తెలిపిన కోమటిరెడ్డి..  సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు.రద్దీ దృష్ట్యా తక్షణమే పండగ వరకు టోల్ వసూలు నిలిపివేయాలని మంత్రిని కోరానన్నారు. మంచి మనస్సుతో పండగవేల టోల్ మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి.