ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ హైదరాబాద్ నగరంలో పర్యటించారు . ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. శనివారం కూకట్‌పల్లిలోని బీజేపీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి డాక్టర్ కొరడాల నరేష్ నివాసానికి వచ్చిన ఆయన పలువురు కార్యకర్తలతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ఆర్సీ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు అర్థం చేసుకొని దేశ భద్రత కోసం బిల్లును అంగీకరిస్తారని ఆయన వివిరించారు దేశంలో శరణార్థుల పేరుతో ఎంతోమంది అక్రమ చొరబాటుదారులు దేశంలో ఉండి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. కార్యక్రమంలో నాయకులు హరీష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పద్మయ్య, హరికృష్ణ, అరుణ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ప్రహ్లాద్ మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.
Post Top Ad
Sunday, January 05, 2020
Home
తెలంగాణ
అక్రమ చొరబాటుదారులను ఆటకట్టించేందుకె ఎన్ఆర్సీ బిల్లు : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ
అక్రమ చొరబాటుదారులను ఆటకట్టించేందుకె ఎన్ఆర్సీ బిల్లు : ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ
Admin Details
Subha Telangana News