కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో సంక్రాంతి సంధర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 11, 2020

కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో సంక్రాంతి సంధర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటి

రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆల్విన్ కాలని డివిజన్ పరిదిలోని ఎల్లమ్మబండ పిజెఆర్ కాలని లోని శ్రీ దత్తసాయి యస్.యల్.ఎఫ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  స్థానిక కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గారు ,జగద్గిరిగుట్ట సిఐ గంగారెడ్డి గారు,యస్ ఐ లింగం గారు హజరయి విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించటం చాలా సంతోషకరం అని అంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డ్ సభ్యులు కాశీనాథ్ యాదవ్,ఏరియా కమిటి సభ్యులు రాములు గౌడ్ నాయకులు శివరాజ్ గౌడ్,ఖాజా,యాదగిరి, వాసు గారితో పాటు తదితరులు ఉన్నారు.