తెలంగాణ కొత్తగా ప్రయివేట్ రైల్స్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 01, 2020

తెలంగాణ కొత్తగా ప్రయివేట్ రైల్స్

కొత్త సంవత్సరంలో దేశ రైల్వే స్థితి గతులను మార్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో ఇందుకోసం టెండర్స్ పిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య అప్రైజల్ కమిటీ డిసెంబర్ 19న గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ప్రైవేట్ రైళ్ల మార్గాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రతిపాదన కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఢిల్లీ-లక్నో మధ్య ప్రైవేట్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 24న దీన్ని ప్రారంభించారు. రెండో ప్రైవేట్ రైలు అహ్మదాబాద్-ముంబై మార్గంలో జనవరి 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.కొత్తగా రాబోతున్న ప్రైవేట్ రైళ్లు సికింద్రాబాద్-విశాఖపట్నం,సికింద్రాబాద్-చెన్నై మార్గాల్లోనూ అందుబాటులోకి రానున్నట్టు సదరు అధికారి తెలిపారు. అలాగే ముంబై-వారణాసి,ముంబై-పుణే,ముంబై-లక్నో,ముంబై-నాగ్‌పూర్,పాట్నా-బెంగళూరు,పుణే-పాట్నా,చెన్నై-కోయంబత్తూరు,సూరత్-వారణాసి,భువనేశ్వర్-కోల్‌కతా మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే న్యూఢిల్లీ-పాట్నా,అలహాబాద్,అమృత్‌సర్,చంఢీఘర్,గోరఖ్‌పూర్,భాగల్‌పూర్ మార్గాల్లోనూ ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.